- Advertisement -

సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. ఇప్పటికే సంక్రాంతికి నాలుగు పెద్ద చిత్రాలు పోటీ పడుతున్నాయి. ‘కళ్యాణం కమనీయం’ జనవరి 14న విడుదల కానుంది.
ఇక ఈ సినిమాతో తమిళ హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ తెలుగుతెరకి పరిచయం కానుంది.
పెళ్లి నేపథ్యంలో సాగే కథ ఇది. కొత్త దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి “హో ఎగిరే” అనే లిరికల్ పాటను విడుదల అయింది.
కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేయగా కపిల్ కపిలన్ పాడారు. యువ జంట మధ్య ప్రేమను చూపే పాట ఇది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది అని అంటున్నారు మేకర్స్.