
వచ్చే వేసవిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా నెలల టైం ఉంది ఎన్నికలకు. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ వంటి రాజకీయ పక్షాలు ఇప్పటికే ఎన్నికల కోసం అంతా రెడీ అవుతున్నాయి. కానీ, పార్టీ యంత్రాంగంలేని రజినీకాంత్ మాత్రం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
నేను ఎన్నికల్లో పోటీ చెయ్యను, ముఖ్యమంత్రి పదవి చేపట్టను అని ఇప్పటికే రజినీకాంత్ ప్రకటించడంతో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. రంగంలోకి దిగకముందే ఆశలు వదులుకున్నాడు అని విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కేవలం ఆయన పార్టీ అభ్యర్థులు మాత్రం పోటీచేస్తారట. ఇంతకీ పార్టీ పేరు ఏంటి అంటే.. అది కూడా చెప్పడం లేదు.
దాంతో రజినీకాంత్ రాజకీయం నాన్ సీరియస్ అని అర్థం అవుతోంది. 9 నెలల్లో పార్టీ పెట్టి ఎన్టీఆర్ లా గెలిచేందుకు… ఇది 1983నాటి కాలం కాదు. మెగాస్టార్ చిరంజీవి ఆలా చేసి బోల్తా కొట్టారు.
రజినీకాంత్ కన్నా బెటర్ గా ఉంది కమల్ మేటర్. కమల్ హాసన్ కి ఒక పార్టీ అంటూ ఉంది. పార్టీ కార్యకర్తలున్నారు. ఆయన పార్టీ అభ్యర్థులు ఇప్పటికే గత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్కరూ కూడా గెలవలేదు అనుకొండి బట్ పార్టీ స్ట్రక్చర్ ఐతే ఉంది కమల్ కి. కానీ ఈయనది కూడా నాన్ సీరియస్ వ్యవహారమే.
7 నెలల్లో ఎన్నికలు ఉండగా… బిగ్ బాస్ ప్రోగ్రాం పెట్టుకున్నాడు. భారతీయుడు 2 షూటింగ్ ఉండనే ఉంది. మరోవైపు, లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా అనౌన్స్ చేశాడు. అంటే వేసవి వరకు కమల్ సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్ తో బిజీ.