
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2021 సమ్మర్లో జరుగుతాయి. ఈ సారి కమల్ హాసన్ కి చెందిన MNM పార్టీ, రజినీకాంత్ పార్టీ కూడా ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు ప్రచారం మొదలుపెట్టారు కమల్ హాసన్.
ఆదివారం చెన్నైలో ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కమల్ హాసన్ పార్టీకి ఇప్పటికే కార్యకర్తలున్నారు. సంస్థాగత నిర్మాణం ఉంది. ఐతే, కమల్ హాసన్ అధికార అన్నాడీఎంకే, బలమైన డీఎంకే, బీజేపీ వంటి పార్టీలను ఎదుర్కోగలరనేది చూడాలి. రజినీకాంత్ ఫోన్ చేస్తే చాలు ఆయన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు రెడీ అని కమల్ హాసన్ అన్నారు. కానీ వీరి పార్టీల మధ్య పొత్తు అసాధ్యమే.
కమల్ హాసన్ బీజేపీకి వ్యతిరేకం. రజినీకాంత్ తో బీజేపీ పార్టీ పెట్టించి ఎన్నికల బరిలోకి దింపుతోంది అనేది విశ్లేషకుల మాట. రజినీకాంత్ ఫిబ్రవరి నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టే ఛాన్స్ ఉంది.