
తమిళ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దక్షిణ కోయంబత్తూర్ నుంచి ఆయన తన పార్టీ MNM తరఫున బరిలోకి దిగారు. తమిళనాడు అసెంబ్లీకి వచ్చే నెల ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల చిట్టాని వివరించారు. రూ.131 కోట్ల విలువ చేసే స్థిరాస్తులున్నట్లు తెలిపారు. 45 కోట్ల చరాస్తులు ఉన్నాయి.
తమిళనాడులో వ్యవసాయ భూములు, చెన్నైలో రెండు ఇల్లు, పలు ఇతర ప్రాపర్టీస్, అలాగే లండన్‌లో ఒక ఇల్లు, కోట్ల విలువ చేసే రెండు లగ్జరీ కార్లు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. దాంతో పాటు 49.5 కోట్ల రూపాయల అప్పు కూడా ఉందట.
కమల్ హాసన్ చిన్నప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బాలనటుడిగా అరంగేట్రం చేశారు. టీనేజ్ వయసులోనే కొరియోగ్రాఫర్ గా మారారు. అందుకే ఆయన పెద్దగా చదువుకోలేదు. కేవలం 8వ తరగతి వరకు చదివినట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు.