వెంకీ-కమల్ హాసన్… ఓ ఆసక్తికర విషయం

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మల్టీస్టారర్లు చేయడానికి వెంకటేష్ ఎప్పుడూ ముందుంటారు. అయితే ఆయన ఇలా మల్టీస్టారర్లు చేయాలనే ఆలోచన చేసింది మాత్రం చాన్నాళ్ల కిందట. దానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని విశ్వనటుడు కమల్ హాసన్ బయటపెట్టారు.

గతంలో మర్మయోగి అనే సినిమా అనుకున్నారు కమల్ హాసన్. ఆయన ప్రకటించి ఆగిపోయిన ఎన్నో సినిమాల్లో అది కూడా ఒకటి. ప్రయోగాత్మకంగా చేద్దామనుకున్న ఆ సినిమా నిజానికి ఓ మల్టీస్టారర్. అందులో మరో హీరో పాత్ర కోసం వెంకటేష్ ను అనుకున్నారట కమల్ హాసన్. అప్పుడెప్పుడో 2 దశాబ్దాల కిందటే దానికి సంబంధించి వెంకీ-కమల్ మధ్య కథాచర్చలు కూడా జరిగాయంట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి రాలేదు.

ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ బయటపెట్టారు. విక్రమ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన కమల్ హాసన్, వెంకటేష్ అంటే తనకు ఎంతో అభిమానం అన్నారు. ఆ సందర్భంగా వెంకీతో సినిమా చేసే అవకాశం మిస్ అయిందని చెప్పుకొచ్చారు. సో.. మల్టీస్టారర్లు చేయాలనే ఆలోచన వెంకటేష్ మనసులో చాన్నాళ్లుగా ఉందనే విషయం, తాజాగా కమల్ బయటపెట్టిన ఉదంతంతో అందరికీ తెలిసొచ్చింది. 

 

More

Related Stories