ఓటిటి నిర్మాతగా మారిన కంగన

Kangana Ranaut in a Saree

కంగన రనౌత్ నిర్మాతగా మారింది. తన సినిమా నిర్మాణ సంస్థకు ‘మణికర్ణిక ఫిలిమ్స్’ అనే పేరు పెట్టింది. ఓటిటిల కోసం సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తుందట.

నిత్యం ప్రధాని మోది జపం చేస్తూ, బీజేపీ పార్టీపై ఈగ వాలకుండా సోషల్ మీడియాలో హంగామా చేసే కంగనా రనౌత్ శనివారం తాను నిర్మాతగా మారిన విషయాన్ని ప్రకటించింది. తన నిర్మాణ సంస్థ లోగోని ఆవిష్కరించింది. నిర్మాతగా ఆమె ఫస్ట్ మూవీ… “టికు వెడ్స్ షేరు”. సెటైరికల్ కామెడీతో కూడిన ప్రేమ కథగా దీన్ని అభివర్ణించింది కంగన.

తన సంస్థ ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తుందట. ‘మణికర్ణిక’ సినిమా ద్వారా ఆమె దర్శకురాలిగా మారింది. ఆ సినిమాకి ఆమెకి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా దక్కింది. అందుకే అదే పేరుని తన ప్రొడక్షన్ బ్యానర్ కి పెట్టింది.

More

Related Stories