కంగనాకి హాయిగా ఉందట

నిత్యం ఘాటు కామెంట్స్ తో, గరంగరంగా ఉండే హీరోయిన్ కంగనా రనౌత్.. చాన్నాళ్ల తర్వాత చాలా హాయిగా ఉందని ట్వీట్ చేసింది. ఇంతకీ ఆమె ప్రశాంతంగా, హాయిగా ఉందని ఎందుకు ట్వీట్ చేసిందో చూద్దాం.

ఈ బాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో “తళైవి” షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా కొన్ని వర్కింగ్ స్టిల్స్ షేర్ చేయడంతో పాటు తమ మనసులో మాట బయటపెట్టింది.

“నిన్న ఎర్లీ మార్నింగ్ మా దర్శకుడు ఏఎల్ విజయ్ తో సీన్ డిస్కషన్ అప్పుడు తీసిన స్టిల్స్ ఇవి. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి. కానీ కానీ నా మటుకు హాయిగా, సౌకర్యవంతంగా అనిపించే ప్రదేశం మాత్రం తళైవి సెట్.”

ఇలా తన సినిమా అప్ డేట్ ఇచ్చింది కంగనా రనౌత్. సుశాంత్ మరణం తర్వాత పూర్తిస్థాయిలో ఫైర్ బ్రాండ్ గా మారిన కంగన, మొన్నటివరకు వాడివేడి ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు తన సినిమాలపై ఫోకస్ పెట్టినట్టుంది.

Related Stories