హేయ్ … మళ్ళీ యేసింది!


కంగన రనౌత్ కి, తాప్సికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది.. కంగన దృష్టిలో తాప్సి తనని కాపీ కొట్టే ఒక చిన్న హీరోయిన్. తాప్సిని “బి-గ్రేడ్ భామ” అంటూ ఈసడించుకుంటుంది కంగన. చాలా కాలంగా వీరి మధ్య ఈ రగడ ఉంది. గతంలో కంగన, తాప్సి మధ్య ట్విట్టర్లో పెద్ద యుద్ధమే నడిచేది. ఐతే, కంగన ఖాతాని ట్విట్టర్ తొలగించింది. అప్పటి నుంచి ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికపై లొల్లి చేస్తోంది.

లేటెస్ట్ గా వీరి మధ్య మళ్ళీ మాటల తూటాలు పేలుతున్నాయి.

“కంగనకి నా జీవితంలో ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఆమె గురించి చర్చ మా మాటల్లో కూడా రాదు,” అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది తాప్సి. ఆ ఒక్క మాట చాలదా కంగన రెచ్చిపోవడానికి! అదే జరిగింది.

“పబ్లిసిటీ కోసం నా పేరు ఉపయోగించుకునే బి-గ్రేడ్ హీరోయిన్ల ప్రయత్నాలను నేను పెద్దగా పట్టించుకోను. కానీ, ఇతరులను చిన్నగా చేసి పెద్దోళ్ళం ఐపోవాలనుకునే స్వభావాన్ని తప్పు పట్టాలి. అలాంటి వాళ్లకు సరైన గుణపాఠం చెప్పాలి,” అంటూ కంగనా ఘాటుగా తాప్సికి జవాబు ఇచ్చింది.

Advertisement
 

More

Related Stories