
కంగన రనౌత్ ఎప్పుడూ స్లిమ్మే. ఐతే, ‘తలైవి’ సినిమా కోసం 15 కిలోల బరువు పెరిగానని చెప్పుకుంటోంది కంగన. జయలలితలా కనిపించేందుకు బొద్దుగా మారానని చెప్తోంది. అందులో నిజమెంతో తెలీదు. 15 కిలోల బరువు పెరిగాను అని చెప్పుకున్న టైంలో కూడా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఫోటోలలో, వీడియోలలో స్లిమ్ గానే కనిపించింది. ఆ గిమ్మిక్ ఏంటో ఆమెకే తెలియాలి.
ఇక అసలు విషయానికి వస్తే జయలలిత కోసం ఇలా బొద్దుగా మారాను, ఇప్పుడు ఇంకో సినిమా కోసం ఇలా ఫిట్ గా మారాను అంటూ కొత్తగా ఒక ఫోటో షేర్ చేసింది కంగన. నాడు, నేడు అన్నట్లుగా రెండు ఫోటోలను షేర్ చేసింది కంగన. ‘జయలలిత’ గెటప్ లో ఆమె నిజంగా బొద్దుగా మారిందో, లేక మేకప్, డ్రెస్సింగ్ మాయానో తెలీదు కానీ ఈ కొత్త లుక్కు కోసం కష్టపడినట్లు కనిపిస్తోంది.
34 ఏళ్ల కంగనా త్వరలోనే “ధాకాడ్”లో నటించనుంది. ఇది యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా కోసం ఇలా ఫిట్ గా మారిపోతోంది.
ప్రతి పాత్ర కోసం ఎంతో కష్టపడుతుంది కంగన. అది కాదనలేని సత్యం. ఐతే, ప్రపంచంలోనే తనలా వైవిధ్యం చూపే మరో నటి లేదని తన డబ్బా తానే కొట్టుకుంటుంది. అందుకే ఎక్కువగా ట్రోలింగ్ కి గురి అవుతుంటుంది.