
గతేడాది కంగన రనౌత్ చేసిన లొల్లి అంతా ఇంతా కాదు. అనేక వివాదాల్లో ఇరుక్కొంది. ఐతే, 2022లో మాత్రం మానసిక ప్రశాంతత కావాలని కోరుకుంటోంది. ఎటువంటి వివాదాలు, కేసులు, గొడవలు లేని లైఫ్ కావాలిట.
తిరుపతి దర్శనం అనంతరం కొత్త ఏడాది మొదటి రోజు శ్రీకాళహస్తికి వచ్చి రాహుకేతు దోష నివారణ పూజలు చేసింది. తన జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవి పోవాలని శ్రద్ధగా పూజలు చేసింది కంగనా.
కంగన నిత్యం వార్తల్లో ఉంటున్న మాట నిజమే కానీ ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడడం లేదు. ఆమెతో కలిసి నటించేందుకు ఏ బాలీవుడ్ హీరో కూడా ఆసక్తి చూపడం లేదు. దాంతో ఆమె అన్ని హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తోంది. బీజేపీ తరఫున గట్టిగా మాట్లాడే ఈ భామకి భక్తి ఎక్కువ. గతంలో బోల్డ్ గా ఉండేది. ఇప్పుడు భక్తి, హిందూమత ధార్మిక ప్రచారం అంటూ హడావిడి చేస్తోంది.
మరోవైపు, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటోంది. 2022లోనే తన కాబోయే భర్త ఎవరో చెప్తాను అని ఇంతకుముందు చెప్పింది.