ఈ భూమ్మీద గొప్ప నటిని నేనే: కంగన

ఈ భూమ్మీద గొప్ప నటిని నేనే: కంగన

‘దూకుడు’ సినిమాలో తనకి తానే పద్మశ్రీ బిరుదుని తన పేరుకు తగిలించుకుంటాడు బ్రహ్మానందం. రియల్ లైఫ్ లో అలాంటి బాపతు కంగనా రనౌతు. సొంత డబ్బా కొట్టుకోవడంలో ఆమెకు ఎవరూ సాటి రారు. అక్కడ పోటిలేదు ఆమెకి. తనంత గొప్ప నటి ఈ భూమి మీద ఎవరూ లేరని తనకి తానే చెప్పుకుంటుంది ఈ భామ. లేటెస్ట్ గా ఆమె ట్వీట్ చేసింది.

ఒక వైపు ‘తలైవి’ సినిమాలో జయలలితగా నటిస్తున్న ఫోటోని, మరోవైపు ‘ధాకాడ్’ సినిమాలో యాక్షన్ హీరోయిన్ గెటప్ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ తన గురించి తానే గొప్పలు పోయింది. “ఒక నటిగా నేను చూపే వైవిధ్యం ఈ ప్రపంచంలో ఏ నటి కూడా చూపలేదు. నాలాంటి రేంజ్ ఏ నటికీ లేదు. మెరిల్ స్ట్రీప్ అంత ప్రతిభ నాలో ఉంది. పైగా నేను గోల్ గోదాత్ లాగా యాక్షన్ స్టంటులు కూడా చెయ్యగలను,” అంటూ తన డబ్బా కొట్టుకొంది.

మెరిల్ స్ట్రీప్ తో పోల్చుకోవడంతో నెటిజన్లు కంగనాని ఒక రేంజులో ఆడుకుంటున్నారు.

మెరిల్ స్ట్రీప్…. గొప్ప నటీమణులే స్ఫూర్తిగా తీసుకునే గ్రేట్ యాక్టర్. ఉత్తమ నటిగా 3 సార్లు ఆస్కార్ గెలుచుకున్నారు ఆమె. అన్నిటికన్నా… ఏకంగా 21 సార్లు ఆస్కార్ కి నామినేట్ అయిన ది వన్ అండ్ ఓన్లీ యాక్ట్రెస్ ఆమె. ఆమెతో పోల్చుకుంటోంది ఈ హర్యానా క్వీన్.

More

Related Stories