నీది నువ్వు చూసుకో కంగన!

- Advertisement -
Kangana Ranaut

కంగన ఎక్కడ ఉంటే అక్కడ కాంట్రవర్సీ ఉంటుంది. ఆమెకి వివాదాలు ఇష్టం. ఆమె మాట్లాడే ప్రతిమాట కోసం ట్రోలర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె హీరోయిన్లు అతిగా ఎక్స్ ఫోజింగ్ చెయ్యడం గురించి కామెంట్ చేసింది. అంతే, ట్రోలర్స్ తమ చేతులకు పని చెప్పారు.

కంగన గతంలో బికినీలు వేసుకొని నటించిన ఫోటోలు బయటికి తీశారు. ఆమె ఫుల్లుగా తొడలు, తన చెస్ట్ చూపించిన ఫోటోలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని బయటికి తీసి మరి ఇదేంటమ్మా అంటూ ఆమెని ఓ రేంజులో ఆడుకుంటున్నారు.

పైగా ఆమె త్వరలో “లాకప్” అనే షోకి హోస్ట్ గా వ్యవహరించనుంది. ఈ షో కోసం చేసిన ఫోటోషూట్ లో ఆమె ఫుల్లుగా అందాలను ఆరబోసింది. ఇతరులను విమర్శించేటప్పుడు నీది నువ్వు చూసుకో అంటూ జనాలు చురకలు అంటిస్తున్నారు. కానీ, కంగన లక్ష్యం వేరు. ఆమె తన ట్రోలర్స్ ని పట్టించుకోదు. తన మాటలపై రచ్చ జరుగుతుందా లేదా అన్నదే చూస్తుంది కంగన.

ఎప్పుడూ వార్తల్లో ఉండడం, ఇతరులను కామెంట్ చెయ్యడం ఈ మనాలి ముద్దుగుమ్మకిష్టం.

 

More

Related Stories