కంగననే విజయేంద్రప్రసాద్ సీత

Kangana


బాహుబలి రచయత విజయేంద్ర ప్రసాద్ అంటే కంగన రనౌత్ కి ఎనలేని గౌరవం, అభిమానం. ఆయన స్క్రిప్ట్ రైటింగ్ పై ఆమెకి బాగా గురి కలిగినట్లుంది. అలాగే, కంగన అంటే అంతేస్థాయిలో అభిమానం చూపుతున్నారు విజయేంద్రప్రసాద్.

ఇప్పటికే, కంగన నటించిన ‘మణికర్ణిక’, ‘తలైవి’ చిత్రాలకు ఆయన కథ, స్క్రీన్ ప్లే అందించారు. రీసెంట్ గా విడుదలైన ‘తలైవి’ దారుణ పరాజయం చూసింది. అయినా ‘సేత’ అనే మరో భారీ ప్రాజెక్ట్ కోసం వీరు ఇద్దరు చేతులు కలపడం విశేషం.

‘సీత’ పేరుతో హిందీ, తెలుగు, తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఒక భారీ పౌరాణిక చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో ‘సీత’ పాత్ర కోసం మొదట కరీనా కపూర్, దీపిక పదుకొను వంటి అగ్ర తారల పేర్లు వినిపించాయి.

కానీ, ఫైనల్ గా కంగనకి దక్కింది ఈ పాత్ర. విజయేంద్రప్రసాద్ కంగన పేరుని సజెస్ట్ చేసినట్లు సమాచారం.

రామాయణం గాథని ‘సీత’ కోణంలో చెప్తారట. కంగన ఈ పాత్ర పోషించనుంది. అలౌకిక్ దేశాయి అనే దర్శకుడు తీసే ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కానుంది.

 

More

Related Stories