కంగనాని అరెస్ట్ చేయాలనుకుంటే…!


కంగన రనౌత్ ఏ మాత్రం తగ్గడం లేదు. సై అంటే సై అంటోంది. “మరో రోజు…. మరో ఎఫ్ ఐ ఆర్. ఒకవేళ నన్ను అరెస్ట్ చెయ్యాలనుకుంటే… ఇప్పుడు ఇంట్లో నా మూడ్ ఎలా ఉందంటే…,” అంటూ ఇలాంటి సెక్సీ ఫోటోని షేర్ చేసింది.

అంటే, మీరు ఎన్ని కేసులు వేసుకున్నా… ఐ డోంట్ కేర్ అన్నట్లుగా ఆమె ఈ ఫోటో పెట్టింది. మీరు ఏమన్నా చేసుకోండి… నేను ఇలా ఎంజాయ్ చేస్తాను అని చెప్తున్నట్లుగా ఉంది ఆమె వైఖరి.

“1947లో మనకు స్వాత్రంత్య్రం రాలేదు. అది బ్రిటిష్ వాళ్ళు వేసిన భిక్ష. మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది 2014లో (మోదీ ప్రధాని అయ్యాక),” అని ఇటీవల కంగన చేసిన కామెంట్స్ తో పెద్ద దుమారం రేగింది. మన ఫ్రీడమ్ ఫైటర్లను ఆమె అవమానించింది అని దేశంలో పలు చోట్ల ఆమెపై కేసులు పడుతున్నాయి. ఐతే, బీజేపీ అండదండలతోనే ఆమె ఇలా రెచ్చిపోతోంది. అందుకే, ఆమె కేసులకు భయపడట్లేదు.

కంగన తన సోషల్ మీడియా వేదికని బీజేపీకి బాకా కొట్టేందుకు వాడుతోంది.

Advertisement
 

More

Related Stories