కంగనాపై ఊర్మిళ ఫైర్

బీజేపీ పేరు చెప్పుకోవట్లేదు కానీ కంగనా రనౌత్ వెనుక ఆ పార్టీ ఉంది అని రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న వారికి కూడా అర్థం అవుతుంది. అధికార పార్టీ పెద్దల అండదండలతో బాలీవుడ్ ని బద్నామ్ చేస్తున్న కంగనపై సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు మెల్లమెల్లగా గళం విప్పుతున్నారు. నిన్న జయా బచ్చన్ పార్లమెంట్ స్పీచ్ తర్వాత రేగిన కలకలం చల్లారకముందే ఇప్పుడు ఊర్మిళ స్పందించారు.

రంగీలా ఫేమ్ ఊర్మిళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఊర్మిళ తాజాగా కంగనాపై విరుచుకు పడ్డారు. “కంగన ఇంటెన్షన్ మంచిది ఐతే… ఆమె ఫస్ట్ తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుంచి డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలి. దేశమంతా డ్రగ్స్ సమస్య ఉంది. కంగనాకి తెలుసా… హిమాచల్ ప్రదేశ్ నుంచే డ్రగ్స్ ఎక్కువగా సరఫరా అవుతాయి. అందుకే సొంత రాష్ట్రము నుంచి ఆమె ఉద్యమం చేపట్టాలి,” అని ఊర్మిళ కంగనాకు సలహా ఇచ్చింది.

“ముంబై నగరం అందరిదీ. ఇక్కడికి వచ్చిన ప్రతివారినీ అక్కున చేర్చికొంది ముంబై. ఒక మరాఠీ అమ్మాయిగా, నేను కంగనా మాటలు సహించను. కంగనా కేవలం ముంబై నగరాన్నే కాదు మా మహారాష్ట్ర మరాఠీలందరిని అవమానించినట్లే భావిస్తాను,” ఊర్మిళ మరాఠీ కార్డు లేవనెత్తింది కంగనాకి వ్యతిరేకంగా.

Advertisement
 

More

Related Stories