కంగనాకి ‘బొమ్మ’ చూపించిన జర్నలిస్ట్

- Advertisement -
Kangana

ఎవరు విమర్శిస్తే వారిని బండబూతులు తిడుతూ ట్విట్టర్లో కలకలం రేపుతోన్న కంగనకు ఒక జర్నలిస్ట్ సినిమా చూపించాడు. దెబ్బకి దిమ్మతిరిగి బొమ్మ కనపడింది ఈ క్వీన్ కి. అంతే… తన ట్వీట్ ని డిలీట్ చేసుకొంది.

అసలు విషయానికొస్తే…

మొన్న ఒక ఇంటర్వ్యూలో కంగన శివసేన ప్రస్తావన తీసుకొచ్చింది. “నేను మొన్నటి ఎన్నికల్లో బీజేపీ బదులు శివసేనకి ఓటు వేశాను. ఇష్టం లేకున్నా నేను, నా కుటుంబ సభ్యులు శివసేనకు ఓటేశాం. బలవంతంగా నాతో శివసేనకు ఓటేయించారు,” అని చెప్పింది.

దాంతో ఇండియాటుడే ఛానెల్లో పనిచేసే కమలేష్ సుతార్ అనే జర్నలిస్ట్ ఒక పాయింట్ లేవనెత్తాడు.

కంగనాకి ఓటు హక్కు ఉన్నది బాంద్రా వెస్ట్ నియోజకవర్గంలో. 2019 ఎన్నికల్లో బీజేపీ – శివ సేన కలిసి పోటీ చేశాయి. ఆమెకి ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలో అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభకి బీజేపీ అభ్యర్థులే నిలబడ్డారు. అక్కడ శివసేన కాండిడేట్స్ పోటీలో లేరు. మరి ఆమె ఎవరికీ ఓటు వేసింది అని ఈ జర్నలిస్ట్ పాయింట్ అవుట్ చేశాడు.

అంతే, కంగనాకి కోపం వచ్చింది. నువ్వు ఒక ట్రోల్ వి…. నీ సంగతి చూస్తా అంటూ బెదిరించింది. దాంతో… సదరు జర్నలిస్ట్ కూడా గట్టిగా సమాధానం ఇచ్చాడు. నేను ఒక జర్నలిస్ట్ ని, ఒక అనామక ట్రోల్ ని కాదు. నీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు లొంగరు అనడంతో…. దెబ్బకి తన ట్వీట్ డిలిట్ చేసుకోంది. అతన్ని బ్లాక్ చేసింది. వెంటనే ముంబై ప్రెస్ క్లబ్, ప్రెస్ అసోసియేషన్ రంగంలోకి దిగాయి. జర్నలిస్టులను బెదిరిస్తే ఊరుకోము అని కంగనాకు హెచ్చరించాయి.

ఆమె చెబుతున్న వాటిలో ఎన్నో అబద్దాలు ఉన్నాయి. ఒక అబద్దం విషయంలో అడ్డంగా దొరికింది అని కామెంట్స్ పడుతున్నాయి

 

More

Related Stories