‘పడుకుంటేనే కదా ఛాన్స్ ఇచ్చారు’

kangana padu

“తిన్న ప్లేటులో ఉమ్మేసే రకాలు వీళ్ళు” అని పేరు ఎత్తకుండా సీనియర్ నటి జయ బచ్చన్ చేసిన విమర్శలతో కంగన రనౌత్ రగిలిపోతోంది. వరుసగా జయ బచ్చన్ ని మెన్షన్ చేస్తూ ట్వీట్స్ వేస్తోంది. అందులో ఒక ట్వీట్ బాగా వైరల్ అయింది.

బాలీవుడ్ ఇండస్ట్రీ నాకు ఏమి వెండి ప్లేట్ ఇవ్వలేదు, బంగారం ప్లేట్ ఇవ్వలేదు… నా తిండిని నేను సంపాదించుకున్నాను అనే అర్థంలో ట్వీట్ చేసింది. “జయ గారూ, మీ ఇండస్ట్రీ నాకు ఎలాంటి తిండి పెట్టింది? ఒక చిన్న పాత్ర ఇచ్చింది. రెండు నిమిషాల పాటు ఉండే ఐటెం సాంగ్, ఒక రొమాంటిక్ సీన్. ఇవే కదా ఆ పాత్రలు. అది కూడా హీరోతో పడుకుంటేనే దక్కేది,” అంటూ ఘాటుగా రాసింది.

బాలీవుడ్ ఇండస్ట్రీకి తనే ఫెమినిజం నేర్పిందని చెప్పుకొచ్చింది కంగన. అంతేకాదు, నేను సంపాదించుకున్న తిండి (స్థానం), జయాది కాదు అంటూ మాట్లాడింది.

Related Stories