సీఎం ఠాక్రేకి కంగన వార్నింగ్

మహారాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని రోజులుగా ఆరోపణలు-విమర్శలు గుప్పిస్తున్న హీరోయిన్ కంగనా రనౌత్ తన ఫైట్ ని మరింత పెంచింది. ఇప్పటివరకు ముంబై పోలీసులు, మంత్రులను తిట్టిన ఆమె ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేరు ప్రస్తావించింది. ఏకంగా ఆయనకే వార్నింగ్ ఇచ్చింది.

ముంబయిలో ఆమె నివశిస్తున్న ఇంటిని (ఇందులోనే ఆమె ఆఫీస్ కూడా) ముంబై మున్సిపల్ అధికారులు కూల్చే ప్రయత్నం చేశారు. కూల్చివేత నోటీసులు అందుకున్న వెంటనే కంగనా కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంటి గేటుతో పాటు.. ప్రాంగణంలో ఉన్న మొక్కలు, ముందు గదిని కూల్చేశారు అధికారులు.

దాంతో, ఆమె వార్నింగ్ వీడియో రిలీజ్ చేసింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఈ రోజు ముంబైకి వచ్చింది. వై ప్లస్ సెక్యూరిటీతో ఎయిర్పోర్ట్ నుంచి తన ఇంటికి వచ్చి వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. “ఉద్దవ్ ఠాక్రే నీకు ఏమనిపిస్తోంది? ఫిలిం మాఫియాతో మిలాఖత్ అయి నా ఇంటిని, ఆఫీస్ ని కూల్చేసి పగ
తీర్చుకున్నాను అనుకుంటున్నావా? ఈ రోజు నా ఇల్లు కూలింది… రేపు నీ అహంకారం మటాష్ అవుద్ది,” అంటూ డైరెక్ట్ గా హెచ్చరికలు చేసింది.

సుశాంత్ సింగ్ కేసుకు సంబంధించి కొన్ని రోజులుగా మహారాష్ట్ర సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తోంది కంగనా. చివరికి ఇవి ఏ స్థాయికి వెళ్లాయంటే ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్ తో కూడా పోల్చింది. ఈ నేపథ్యంలో ఆమె ఇంటి కూల్చివేత అంశం కీలకంగా మారింది.

కంగనా తమపై చేస్తున్న ఆరోపణలకు, ఇంటి కూల్చివేతకు సంబంధం లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. కేవలం ఫిర్యాదు ఆధారంగా ముంబయి మున్సిపల్ అధికారులు స్పందించారని కవర్ చేసే ప్రయత్నం చేశారు.

కాశ్మీర్, అయోధ్యలపై సినిమా తీస్తాను అని ప్రకటించింది.

Advertisement
 

More

Related Stories