బేలగా కంగన అభ్యర్థన!

- Advertisement -
Kangana


ఇంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది కంగన రనౌత్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై ఎన్నో విమర్శలు చేసింది. కానీ, ఇప్పుడు బేలగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. మహారాష్ట్రలో థియేటర్లను తెరవాలని ఆమె కోరుతోంది. ఇది ఆమె ఒక్కదాని అభ్యర్థన కాదు. హిందీ సినిమా ఇండస్ట్రీ అంతా అడుగుతోంది. ఐతే, కంగన ప్రత్యేకంగా అడగడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆమె నటించిన ‘తలైవి’ ఈ నెల 10న దేశమంతా విడుదల అవుతోంది. కానీ, మహారాష్ట్రలో థియేటర్లకు ఇంకా అనుమతి లేదు. కరోనా కేసులు తగ్గినా మహారాష్ట్ర ప్రభుత్వం రిస్క్ తీసుకోవడం లేదు. మరికొంత కాలం ఆగాలి అని భావిస్తోంది. అంతేకాదు, కంగన సినిమా విడుదల ఉన్న టైంలో థియేటర్లను తెరిచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు.

‘తలైవి’ సినిమా కంగనాకి పెద్ద పరీక్ష. ఈ సినిమాకి హిందీ మార్కెట్ లో ఓపెనింగ్ వచ్చినా, రాకపోయినా పెద్ద సమస్య లేదు కానీ తమిళనాడులో మాత్రం రావాలి. ఇది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్.

తమిళనాడులో కూడా కలెక్షన్లు రాకపోతే, ఆ సినిమా తీసినదానికి అర్థం ఉండదు. ఐతే, తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు కూడా పరాజయం పాలు అయ్యాయి. కాబట్టి, జయలలిత బయోపిక్ విషయంలో కూడా సందేహాలు ఉన్నాయి.

 

More

Related Stories