హీరోలు డ్రగ్స్ బానిసలు: కంగన

Kangana Ranaut

బాలీవుడ్ ఒక మురికి కూపం అంటోంది కంగనా. ఇండస్ట్రీ మొత్తంలో ఉన్న వారంతా డ్రగ్సుకి బానిస అని చెప్తోంది. నార్కోటిక్ బోర్డు ధైర్యంగా పరిశోధన చేస్తే… బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఎందరో ఊచలు లెక్క పెడుతారని బాంబ్ పేల్చింది. సుశాంత్ సింగ్ మరణం కేసు ఇలా మలుపు తిరిగింది.

Also Read: ఇక ఇప్పుడు డ్రగ్సు కేసు!?

“నేను ఇంకా మైనర్ గా ఉన్నప్పుడే… నా గురువు అని చెప్పుకునే రాక్షసుడు (మహేష్ భట్ అని చదువుకోవాలి) నన్ను పార్టీలకు తీసుకెళ్లి డ్రింక్ లో మత్తు మందు కలిపేవాడు. నేను పోలీసులను కలవకుండా ఎప్పుడూ చేసేవాడు. నేను సక్సెస్ సాధించాక… బాలీవుడ్ పార్టీ కల్చర్ ఎలా ఉంటుందో అర్థమైంది. డ్రగ్స్, నీతి మాలిన మనుషులు, మాఫియా.. అన్ని చూశాను,” అని ట్వీటింది.

మరి సక్సెస్ సాధించి… మహేష్ భట్ కి దూరంగా జరిగిన తర్వాత పోలీసుల వద్దకు వెళ్లి ఎందుకు మాట్లాడలేదంట? కంగనా అంటే అంతే మరి.

“బాలీవుడ్ లో పాపులర్ డ్రగ్ …కొకైన్. నాకు రక్షణ కల్పిస్తే.. నార్కోటిక్స్ బోర్డు సాయపడుతా. సుశాంత్ కి ఈ సీక్రెట్లు తెలిసాయి. అందుకే అతన్ని చంపారు,” అని ఆరోపించింది కంగన.

మొదట…నెపోటిజం వల్ల సుశాంత్ నష్టపోయాడు అన్నారు. ఆ నిరాశలో సుశాంత్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడనే వాదన వచ్చింది . అప్పుడు కంగనా ..నెపోటిజమ్ మీద గట్టిగా మాట్లాడింది. తర్వాత… ముంబై పోలీసులు విచారణ సరిగా చెయ్యడం లేదని, ఒక రాజకీయ నేతని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నారు. అప్పుడు ముంబై పోలీసులని తప్పు పట్టింది కంగనా. తర్వాత రియా చక్రవర్తి మీద సుశాంత్ తండ్రి అనుమానం వ్యక్తం చేస్తే… మహేష్ భట్, రియా చక్రవర్తి బంధం గురించి మాట్లాడింది. ఇప్పుడు డ్రగ్స్, రియాకి, కొకైన్ ముఠాలకి లింక్ ఉందని ఈడీ అనుమానం వ్యక్తం చెయ్యడంతో కంగనా మళ్ళీ మాట మార్చింది.

Related Stories