ఆ ఛాన్స్ మిస్ చేసుకోదట!

- Advertisement -


కంగన రనౌత్ మన రాజమౌళికి వీరాభిమానిగా మారారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఆమె నటించిన పలు సినిమాలకు రచయితగా పని చేశారు. అలా రాజమౌళితో పరిచయం ఉంది. ఐతే, ఇంతకుముందెప్పుడూ రాజమౌళిని ఈ రేంజులో పొగడలేదు. ఇప్పుడు రాజమౌళి విజన్ కి ఆమె ఫిదా అయిపోయారట. దేశంలో ఆయనలాంటి దర్శకుడు మరొకరు లేరు అనేది ఆమె మాట.

మరి ఇంతగా కంగన రనౌత్ పొగిడేస్తోంటే జనాలకు అనుమానం వస్తోంది. రాజమౌళి తదుపరి చిత్రంలో పెద్ద రోల్ కొట్టేయాలని ప్లాన్ చేసిందా అన్న డౌట్స్ వస్తున్నాయి.

“నేను రాజమౌళి వర్క్ ని చూసి మెచ్చుకుంటున్నాను. నేను అవకాశాల కోసం దర్శకులను, హీరోలను పొగడను. అది నా వ్యక్తితం కాదు. రాజమౌళి తీసిన అన్ని సినిమాలు చూశాను. ఆయన విజన్ కి హ్యాట్సాఫ్ చెప్తున్నాను. నేను ఎంత పెద్ద దర్శకుడినైనా పాత్రలు ఇవ్వమని అడగను,” అని వివరణ వచ్చింది ఆమె నుంచి.

ఒకవేళ తన నెక్స్ట్ మూవీలో నటించే ఛాన్స్ రాజమౌళి స్వయంగా ఇస్తే? “ఆయన అడిగితే ఆ అవకాశాన్ని వదులుకోను. కానీ, నా అంతటా నేను అడగను,” అని కుండబద్దలు కొట్టారు కంగన.

మరి రాజమౌళి కంగనకి హీరోయిన్ గానో, లేదంటే ‘ప్రత్యేక పాత్ర’ ఏదైనా ఇస్తారా? పాన్ ఇండియా మార్కెట్ కోసం ఆయన ఇటీవల బాలీవుడ్ నటులను తన సినిమాల్లో తీసుకుంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’లో అజయ్ దేవగన్ కి కీలక పాత్ర ఇచ్చారు రాజమౌళి. మరి, కంగనాకి కూడా అలాంటిది ఏమైనా రాజమౌళి ప్లాన్ చేస్తారేమో చూడాలి.

 

More

Related Stories