బాలీవుడ్ ని టాలీవుడ్ దాటేసింది: కంగనా


Kangana

మహారాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతున్న కంగనా రనౌత్ తాజాగా టాలీవుడే నంబర్ వన్ ఇండస్ట్రీ అని చెప్తోంది. మన దేశంలో అతి పెద్ద చిత్ర సీమ బాలీవుడ్ అనుకుంటారు కానీ నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమ బాలీవుడ్ ని ఎప్పుడో దాటేసింది అని అంటోంది కంగనా. ఇంతకీ ఈ మనాలి ముద్దుగుమ్మకు సడెన్ గా మన చిత్రసీమపై ప్రేమ ఎందుకొచ్చింది? వెల్, దానికి కారణం ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ రాష్ట్రంలో ఒక భారీ ఫిలిం సిటీ నిర్మించనున్నట్లు ప్రకటించాడు. ఢిల్లీకి సమీపంలోని నోయిడా నగరంలో దేశంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ నిర్మిస్తాడట.

ఆ వార్తని ట్వీట్ చేస్తూ ఆమె ఈ కామెంట్స్ చేసింది.

“తెలుగు చిత్రసీమ అనేక భాషల్లో సినిమాలని విడుదల చేస్తూ మొత్తం భారత్ అంతా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది,” అని కంగనా పేర్కొంది. ప్రధాని మోడీకి ట్వీట్ చేస్తూ… అన్ని భాషల చిత్రసీమలను ఏకం చేసి “ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ” గా మలిస్తే బెటర్ అని చెప్తోంది. అపుడు మనం హాలీవుడ్ ని ఢీ కొట్టొచ్చట.

హిందీ సినిమాల క్వాలిటీ తగ్గిపోయిందని అందుకే హిందీలోకి డబ్ చేసిన హాలీవుడ్ చిత్రాలు ఇప్పుడు డామినేట్ చేస్తున్నాయి అంటోంది.

Related Stories