
ఇది కంగన రెబలిజం పార్ట్-2.
సుశాంత్ సింగ్ మరణం తర్వాత హీరోయిన్ కంగనా రనౌత్ ఫైర్ బ్రాండ్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అలియాభట్, కరణ్ జోహార్, మహేష్ భట్ ను ఓ రౌండ్ వేసుకున్న కంగనా.. ఇప్పుడు దీపిక పదుకోన్, రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానాలను టార్గెట్ చేసింది. ఈసారి టీమ్ కంగనా తమ మాటలకు మరింత పదునుపెట్టింది.
టీమ్ కంగనా ఆరోపణల ప్రకారం.. “దీపిక పదుకోన్ తనను తాను ఓ మానసిక వ్యాధిగ్రస్తురాలిగా ప్రకటించుకుంది. కానీ తనను ఎవ్వరూ సైకో అనిగానీ, రాక్షసి అని గానీ అనరు. ఇక అమ్మాయిల చుట్టూ చక్కర్లు కొట్టే రణబీర్ ను ఎవ్వరూ రేపిస్ట్ అనరు. చిన్న పట్టణాలు, సాధారణ కుటుంబాల నుంచి వచ్చే నాలాంటి వాళ్లనే టార్గెట్ చేస్తారు.”
వీళ్లతో పాటు ఆయుష్మాన్ ఖురాను కూడా టార్గెట్ చేసింది టీం కంగన.
ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న రియా చక్రబర్తికి మద్దతుగా ఆయుష్మాన్ మాట్లాడినందుకు “టీమ్ కంగనా” ఫైర్ అయింది. నెపొటిజంపై చాలా ఎత్తున చర్చ జరుగుతుంటే ఆయుష్మాన్ మాత్రం స్టార్ కిడ్స్ కే మద్దతిస్తున్నాడని.. బాలీవుడ్ మాఫియా నుంచి ఆయుష్మాన్ ఏదో ఆశిస్తున్నాడంటూ విమర్శించడంతో పాటు చప్లాస్ గా అతడ్ని పేర్కొంది.