కంగనా ఫెయిల్… ’12 ఫెయిల్’ పాస్!

Kangana


కంగన రనౌత్ నటించిన “తేజస్” సినిమాతో పాటు “12త్ ఫెయిల్” అనే సినిమా పోటీ పడింది. గతవారం ఈ రెండు చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. మొదటి వీకెండ్ ముగిసేసరికి కంగన మూవీ ఇండియాలో మూడున్నర (Rs 3.50 cr) కోట్లు సంపాదించింది.

ఇక “12త్ ఫెయిల్” అనే చిత్రం మొదటి వీకెండ్ ఇండియాలో ఏడు (Rs 7 cr) కోట్లు కొల్లగొట్టింది. అంటే కంగన చిత్రం కంటే డబుల్ వసూళ్లు వచ్చాయి. ఒక పెద్ద హీరోయిన్ నటించిన మూవీ కన్నా స్టార్స్ లేని ఒక మూవీ ఎక్కువ వసూళ్లు అందుకొంది.

కంగనకి అపజయాలు కొత్తేమీ కాదు. ఆమె కెరీర్ లో దాదాపు 20 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఐతే ఒక చిన్న చిత్రంతో పోటీపడి కూడా దాని కన్నా ఎక్కువ వసూళ్లు సంపాదించలేకపోయింది కంగనా. దాంతో ఆమె ఎక్కువ ట్రోలింగ్ పొందుతోంది. గతంలో బాలీవుడ్ చిత్రాలను బాయ్ కట్ చెయ్యమని కంగన సోషల్ మీడియా వేదికపై కోరింది. అంటే ఖాన్ హీరోల చిత్రాలతో పాటు రణబీర్ కపూర్, అలియా భట్ వంటి ఇతర స్టార్స్ సినిమాలు చూడొద్దు అని తెగ పోస్టులు పెట్టేది. ఇప్పుడు ఆమె సినిమాలను కూడా జనం చూడడం లేదని.

బాలీవుడ్ చిత్రాలు చూడొద్దని కంగన దీదీ చెప్పింది అనే అభిమానులు కూడా ఆమె సినిమాలను చూడడం మానేశారా అంటూ జనం ట్రోల్ చేస్తున్నారు.

12th Fail

’12త్ ఫెయిల్’ చిత్రానికి దర్శకుడు విధు వినోద్ చోప్రా. ఆయన పెద్ద దర్శకుడే. కానీ కాన్సెప్ట్ బేస్డ్ గా చిన్న చిత్రం తీశారు. పెద్దగా హడావుడి చెయ్యలేదు. కానీ కథ, కథనాల్లో ఉన్న దమ్ము వల్ల సినిమా ఆడుతోంది.

Advertisement
 

More

Related Stories