కంగనాకి ట్విట్టర్ ‘వార్నింగ్’

కంగనాకి ట్విట్టర్ 'వార్నింగ్'

ఆ మధ్య అమెరికా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ డిలీట్ అయింది. ట్రంప్ ట్విట్టర్ వేదికను దుర్వినియోగం చేస్తూ అబద్దాలను ప్రాపగాండా చేస్తుండడంతో ట్విట్టర్ సంస్థ ట్రంప్ అకౌంట్ ని సస్పెండ్ చేసి కలకలం సృష్టించింది. ఇప్పుడు ఇండియాలో కంగనా రనౌత్ కి అలాంటి వార్నింగ్ ఇచ్చింది.

తాజాగా కంగనా రనౌత్ వ్యవసాయ చట్టలకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను టెర్రరిస్టులుగా పేర్కొంటూ ట్వీట్ చేసింది. ఆ పోస్ట్ ని ట్విట్టర్ ఆటోమేటిక్ గా డిలీట్ చేసింది. అంటే ట్విట్టర్ టీం కంగన పోస్ట్ లపై ఓ కన్ను వేసి ఉంచింది. ఆమె హద్దు దాటితే, అకౌంట్ ని మొత్తం లేపేస్తుంది. ఇంతకుముందు, ఆమె సిస్టర్ రంగోలి ఇలాంటి పని చేస్తే… ఆమె అకౌంట్ ని బ్లాక్ చేశారు. ఇప్పుడు కంగనాకు మొదటి వార్నింగ్ ఇచ్చినట్లే.

కంగనా బీజేపీలో చేరలేదు. కానీ బీజేపీ ప్రభుత్వానికి చంచాగిరి చేస్తోంది. మోడీ ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా… బూతులు తిడుతూ ట్విట్టర్లో అందరిని బెదరిస్తుంటుంది. మోదీపై, బీజేపీపై అభిమానం తప్పులేదు. కానీ ప్రధానిని, కేంద్ర ప్రభుత్వంపై ఎవరు విమర్శలు చేసినా వాళ్ళని టార్గెట్ చేసి హంగామా చేస్తోంది.

More

Related Stories