కలిసి రాసుకుందాం!

Kanika Dhillon and Himanshu

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి ఓ ఏడాది కిందట వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి తెలిసిందే. భార్య కనికా థిల్లాన్ తో అతడు విడాకులు తీసుకున్నాడు. అదే టైమ్ లో హీరోయిన్ అనుష్కను ప్రకాష్ పెళ్లి చేసుకుంటాడంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తల్ని ప్రకాష్ అప్పట్లో ఖండించాడు.

కట్ చేస్తే, అప్పుడు ప్రకాష్ తో విడాకులు తీసుకున్న కనికా, ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించింది. బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం.. రచయిత హిమాన్షు శర్మతో ఈమె రిలేషన్ షిప్ లో ఉన్నట్టు తెలుస్తోంది. కనిక ఫ్రెండ్ గరిమా.. వీళ్లిద్దరి ఫొటోను పోస్ట్ చేస్తూ, కనిక-హిమాన్షు ప్రేమలో ఉన్నారనే విషయాన్ని ప్రకటించింది.

“తను వెడ్స్ మను”, “రాంఝానా” లాంటి సినిమాలకు రైటర్ గా పనిచేశాడు హిమాన్షు. అటు కనిక కూడా “జడ్జిమెంటల్ హై క్యా”, “గిల్టీ” లాంటి సినిమాలకు స్క్రిప్ట్స్ రాస్తూ బాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.  

చూస్తుంటే.. కనిక-హిమాన్షు బాగానే సెటిలైనట్టున్నారు. మరి ప్రకాష్ కోవెలమూడి తన జీవితంపై ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Related Stories