త్వరలోనే కనిక రెండో పెళ్లి

- Advertisement -

కనిక ధిల్లాన్ గుర్తుందా? బాలీవుడ్లో ఫేమస్ రైటర్ ఆమె. మన తెలుగువారికి మాత్రం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కోడలుగా పరిచయం.

రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి, కనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2014లో జరిగింది వీరి వివాహం. ఐతే మూడేళ్లకే ఇద్దరూ విడిపోయారు. లాస్ట్ ఇయర్ ఇద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.

దాంతో, ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటోంది. బాలీవుడ్ లో పేరొందిన రైటర్ హిమాంషు శర్మతో ప్రేమలో పడింది. గత నెలలో వీరి ఎంగేజిమెంట్ జరిగింది. ఐతే, ఆ విషయాన్నీ ఆమె ఇప్పుడు బయటపెట్టింది. తన సోషల్ మీడియాలో ఎంగేజిమెంట్ ఫోటోలు షేర్ చేసింది. జనవరిలో వీరి పెళ్లి జరగనుంది.

కనిక, హిమాంషు… ఇద్దరూ బాలీవుడ్లో పెద్ద పెద్ద సినిమాలకు స్క్రిప్ట్ రైటర్స్ గా వర్క్ చేస్తున్నారు. మరోవైపు, ప్రకాష్ కోవెలమూడి ఒక టాప్ హీరోయిన్నీ పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ మధ్య వార్తలు షికార్లు చేశాయి. కానీ అవి రూమర్లుగానే మిగిలాయి.

 

More

Related Stories