న్యూజిలాండ్ లో కన్నప్ప త్యాగాలు!

- Advertisement -
Manchu Vishnu

“కన్నప్ప” చిత్రం మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్. విష్ణు ప్రధాన పాత్రలో ‘భక్త కన్నప్ప’ చిత్రం కొత్తగా, భారీగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో మొదలైంది. దేశ, విదేశాలకు చెందిన 600 మంది (నటీనట వర్గం, సాంకేతిక నిపుణులు, సినీ కార్మికులతో కూడిన టీం) న్యూజిలాండ్ లో పనిచేస్తున్నారట.

ప్రధాన భాగం అంతా అక్కడే చిత్రీకరిస్తారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అక్కడ షూటింగ్ మొదలైంది. ఐతే, తన డ్రీం ప్రాజెక్ట్ కోసం 600 మంది “త్యాగాలు” చేసేందుకు సిద్ధమయ్యారు అని మంచు విష్ణు అంటున్నారు. “తమ వారిని” వదిలి న్యూజిలాండ్ అడవుల్లోకి వచ్చారని ఎమోషనల్ గా రాశారు. అదే వారి త్యాగం.

ఈ సినిమాకి తనికెళ్ళ భరణి, పరచూరి గోపాల కృష్ణ, విజయేంద్రప్రసాద్, తోటపల్లి సాయినాథ్ వంటి రచయితలంతా కలిసి ఈ స్క్రిప్ట్ రెడీ చేశారట.

“కన్నప్ప”కి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తీసుకొచ్చేందుకు ప్రభాస్, నయనతారలను అతిథి పాత్రల్లో చూపిస్తున్నారు.

 

More

Related Stories