4వ శతాబ్దంలో ‘కాంతర 2’

Kantara 2

“కాంతర” సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనే కాదు హిందీలో కూడా బిగ్ హిట్. ఈ సినిమా ఓవరాల్ గా నాలుగు వందల కోట్లు కొల్లగొట్టింది. సినిమాకి అయిన ఖర్చు… కేవలం 30 కోట్లు. అందుకే, ఇప్పుడు అందరి చూపులు “కాంతర 2″పై ఉన్నాయి.

“కాంతర” సినిమా కథ కొంత 1970, 80లలో కొంత భాగం రాజుల కాలంలో జరిగినట్లు చూపించారు. ఇక రెండో భాగం పూర్తిగా 4వ శతాబ్దంలో జరుగుతుందట.

“కాంతర” చూపించిన ఆ ఆచారం ఎలా పుట్టింది అనేది చూపిస్తారని టాక్. కథ, కథనాలు గ్రాండ్ గా ఉంటాయట. ఇప్పుడు బడ్జెట్ పరిమితులు లేవు కాబట్టి విజువల్స్ మరింత స్టన్నింగ్ గా ఉంటాయి అని దర్శకుడు రిషబ్ శెట్టి చెప్తున్నారు.

ఐతే, ఇందులో బాలీవుడ్ నటులు నటిస్తారు అనే మాట నిజం కాదు. పూర్తిగా కన్నడ నటులతోనే సినిమా తీస్తున్నారు.

Advertisement
 

More

Related Stories