అమెజాన్లోకి వచ్చిన కాంతార

Kantara

ఇటీవల థియేటర్ లో పెద్ద హిట్ అయిన సినిమా… కాంతార. ఇది కన్నడ చిత్రం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో డబ్ అయింది. కన్నడ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో బాగా విజయం సాధించింది.

10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ కర్ణాటక లో 90 కోట్లు, తెలుగునాట 28 కోట్లు కొల్లగొట్టింది. హిందీలో కూడా పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలోకి వస్తోంది. గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేశమంతా క్రేజ్ ఉంది. మరి ఓటిటిలో ఎంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ఈ సినిమాకి కీలకం …. చివరి 20 నిమిషాలు. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతం. ఓటిటిలో చూసినప్పుడు కూడా జనం అదే అనుభూతి పొందుతారా అన్నది చూడాలి.

 

More

Related Stories