పుష్పకవిమానం టు ‘కన్యాకుమారి’

ఆనంద్ దేవరకొండ హీరోగా “పుష్పక విమానం” అనే చిత్రాన్ని తీసిన దర్శకుడు దామోదర తన రెండో సినిమా సిద్ధం చేస్తున్నాడు. ఈ రెండో చిత్రం పేరు… ‘కన్యాకుమారి’. అతనే నిర్మాత.

ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.

పుష్పక విమానంలో ఓ హీరోయిన్ గా నటించిన గీతా శైనీ ఈ సినిమాలో హీరోయిన్. శ్రీ చరణ్ రాచకొండ హీరో. మొదటి చిత్రాన్ని తెలంగాణ ప్రాంతం నేపథ్యంలో చూపించిన దామోదర ఈ కథను శ్రీకాకుళం నేపథ్యంలో గ్రామీణ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ‘కన్యాకుమారి’.

Advertisement
 

More

Related Stories