
‘లైగర్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం కానుంది బాలీవుడ్ భామ అనన్య పాండే. విజయ్ దేవరకొండ సరసన నటించింది. ఈ అందాల భామ ప్రస్తుతం ఒక హీరోతో డేటింగ్ లో ఉందట. అనన్య బాయ్ ఫ్రెండ్ ఎవరు అన్న విషయంలో అందరికి ఉన్న డౌట్ ని దర్శక, నిర్మాత కరణ్ జోహార్ తీర్చేశారు.
కరణ్ నిర్వహిస్తోన్న టాక్ షోకి విజయ్ దేవరకొండ, అనన్య ఇద్దరూ జంటగా విచ్చేశారు. అనన్య విషయానికి వస్తే ఆదిత్య రాయ్ కపూర్ తో డేటింగ్ లో ఉన్నావట నిజమేనా అని అడిగేశారు కరణ్.
విజయ్ లవ్ గురించి కరణ్ కొన్ని విషయాలు అడిగారు. పోయిన వారం ఎపిసోడ్ లో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ తమకి విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అని చెప్పారు. ఆ విషయాన్నీ ప్రస్తావిస్తూ కరణ్ అడిగిన ప్రశ్నకు ‘త్రీసమ్’కి (ఇద్దరితో రొమాన్స్) రెడీ అంటూ కొంటెగా సమాధానం ఇచ్చాడు విజయ్.
వీరు ఇతర ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వారం ‘కాఫీ విత్ కరణ్’ ఎపిసోడ్ కోసం చూడాలి.
అనన్య, విజయ్ దేవరకొండల కాఫీ విత్ కరణ్ షో ప్రోమో కోసం కింద క్లిక్ చెయ్యండి.