బాలీవుడ్ కి దమ్ము లేదు!

Karan Johar


బాలీవుడ్ సినిమాల వసూళ్లు పూర్తిగా పడిపోయాయి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు దేశవ్యాప్తంగా ఆడుతున్నాయి. ఇది కొత్త ట్రెండ్. ఒకప్పుడు దేశంలో బాలీవుడ్ దే డామినేషన్. బాలీవుడ్ కి ఈ దుస్థితి రావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత మాత్రం హిందీ సినిమా హీరోలు, దర్శకులు, నిర్మాతల్లో గట్స్ పోయాయి అని అంటున్నారు.

“ఒకప్పుడు బాలీవుడ్ లో ఒరిజినల్ కంటెంట్ ని సృష్టించే దమ్ము ఉండేది. ఇప్పుడు అది లోపించింది. అదే శాపంగా మారింది,” అన్నారు కరణ్.

“ఎప్పుడైతే బాలీవుడ్ నిర్మాతలు తెలుగు, తమిళ సినిమాల రీమేక్ ల వెంట పడ్డారో అప్పుడే పతనం మొదలైంది. తెలుగులో, తమిళంలో హిట్ టాక్ తెచ్చుకున్న ప్రతి సినిమా హక్కులు కొనడం, సినిమా తీయడం ఇదే పద్దతి అయింది. సొంత ఆలోచనలు, సొంత కథలు గురించి ఆలోచించడం మానేశారు,” అని విశ్లేషించారు.

‘బ్రహ్మాస్త్ర’ వంటి సినిమాలను కరణ్ జోహార్ నిర్మించారు ఇటీవల. అలాగే, ‘లైగర్’ సినిమాకి ప్రెజెంటర్ గా వ్యవహరించారు.

 

More

Related Stories