కరీనా కపూర్ సౌత్ ఇండియన్ సినిమాల్లోకి అడుగుపెడుతోంది. ఆ విషయాన్నీ ఆమె స్వయంగా ఇటీవల ప్రకటించింది. కాకపోతే, ఆమె ఏ సినిమాలో నటించబోతుంది అనేది చెప్పలేదు. కానీ ఆమె యష్ నటిస్తోన్న కొత్త చిత్రం “టాక్సిక్”లో నటించనుంది అని అర్థమైంది.
కరీనా కపూర్, యష్ జోడి గురించి ఇప్పటికే చాలా చర్చ జరిగింది. కానీ యష్ అభిమానులు మాత్రం ఈ జోడిపై నెగెటివ్ కామెంట్ చేశారు. యష్ సరసన యంగ్ హీరోయిన్ ని పెట్టండి అంటూ వాళ్ళు సోషల్ మీడియాలో మేకర్స్ కి ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. వారి కోరిక నెరవేరింది.
తాజా సమాచారం ప్రకారం కరీనా ఈ సినిమాలో యష్ కి జోడిగా నటించడం లేదంట. ఆమె యష్ కి సిస్టర్ గా నటించనుంది అనేది లేటెస్ట్ అప్డేట్.
మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తోన్న “టాక్సిక్”లో యష్ సరసన ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. కరీనా కపూర్ మాత్రం అతనికి సిస్టర్ గానే కనిపిస్తుందట.