ప్రభాస్ బిర్యానీకి కరీనా కూడా ఫిదా

- Advertisement -

ప్రభాస్ ఆతిథ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ప్రభాస్ అతిథి మర్యాదలు ఎలా ఉంటాయో ఎన్నోసార్లో చెప్పారు. ప్రభాస్ సినిమా షూటింగ్ అంటే అందులో నటించే హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు బాగా వర్క్ అవుట్ చేసి రావాలి. ఎందుకంటే రుచికరమైన ఎన్నో వెరైటీల ఫుడ్ ని సర్వ్ చేస్తారు ఆయన సెట్ లో. ముఖ్యంగా ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధతో చేయించే వంటకాలు తింటే ఆ రుచిని మరువలేరు.

తాజాగా కరీనా కపూర్ కూడా ప్రభాస్ ఫుడ్ సర్వింగ్ ఎలా ఉంటుంది తెలుసుకొంది. ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ‘ఆదిపురుష్’ షూటింగ్ లో ఉన్నాడు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపిస్తారు. సైఫ్ కోసం మంచి ఆంధ్రా, హైదరాబాద్ బిర్యానీలు స్పెషల్ గా చేయించి వడ్డించారట. భర్త కోసం సెట్ కి వచ్చిన కరీనా కూడా ఆ బిర్యానీ తిని అద్భుతం అంటూ కితాబు ఇచ్చింది.

ఆమె బిర్యానీ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

చూస్తుంటే ప్రభాస్ తయారు చేయించే వంటకాలు మొత్తం బాలీవుడ్ అంతా రుచి చూసేలా ఉంది. ప్రభాస్ తో నటిస్తున్న ప్రతి నటుడు, నటి ఆయన చేయించే వంటకాలను తప్పకుండా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు. హీరోగానే కాదు మంచి అతిథిగా కూడా ప్రభాస్ పేరు మార్మోగిపోతోంది.

 

More

Related Stories