మళ్ళీ తల్లి కాబోతున్న బెబో

Kareena Kapoor

కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ జంటకు ఇప్పటికే ఓ బాబు ఉన్నాడు. బెబో-సైఫ్ వారసుడిగా తైమూర్ అలీఖాన్ సోషల్ మీడియాలో చేస్తున్న సందడి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తైమూరుకు మరో తోడు రాబోతోంది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది కరీనా కపూర్.

ప్రస్తుతం బాలీవుడ్ లో వినిపిస్తున్న దాని ప్రకారం.. సైఫ్-కరీనా మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఆమధ్య జరిగిన ఓ ఛాట్ సెషన్ లో కూడా కరీనా ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది. తమ ఫ్యామిలీని ఎక్స్ టెండ్ చేసుకోవాలని అనుకుంటున్నామని తెలిపింది. దీంతో ఈ జంట, తమ రెండో సంతానం కోసం ప్రయత్నిస్తోందనే వార్త పక్కా అయింది.

39 ఏళ్ల కరీనా కపూర్ పెళ్లి తర్వాత కూడా అదే స్టార్ డమ్ కొనసాగిస్తోంది.

తైమూర్ పుట్టినప్పుడు కాస్త గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత మళ్లీ నాజూగ్గా తయారై సినిమాల్లో హల్ చల్ చేసింది. ప్రస్తుతం కరీనా చేతిలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న “లాల్ సింగ్ చద్దా” సినిమా ఉంది. ఈ మూవీ తర్వాత ఆమె మళ్లీ గ్యాప్ తీసుకునే అవకాశం ఉంది.

Related Stories