తెలుగు కన్నా ముందే తమిళంలో

karthi news

మలయాళంలో సూపర్ హిట్టైన “అయ్యపనం కోషియం” సినిమాని తెలుగులో రానా, బాలకృష్ణలతో తీయాలని అనుకున్నారు. కానీ, బాలకృష్ణ ఒప్పుకోలేదు. ఆ తర్వాత రవితేజ, పవన్ కళ్యాణ్, వెంకటేష్…. ఇలా చాలా పేర్లు వినిపించాయి. 6 నెలలు గడిచాయి. కానీ ఇంతవరకు క్లారిటీ లేదు.

కానీ తమిళంలో మాత్రం రీమేక్ పనులు ఊపందుకున్నాయి. తమిళ స్టార్ కార్తీ నటించేందుకు ఒప్పుకున్నాడు. మరో పాత్రలో పార్తీబన్ నటిస్తాడట. సో… కరోనా కేసులు తగ్గిన వెంటనే ఈ రీమేక్ ని మొదలుపెడుతారట.

మరోవైపు, కార్తీ మళ్లీ షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. “సుల్తాన్” అనే సినిమాని పూర్తి చేస్తాడట. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. లాక్డౌన్ కి ముందు షూటింగ్ ఆగింది. అది ఇప్పుడు మొదలు పెడుతున్నాడు.

Related Stories