ఆ హీరోయిన్ కరెంట్ బిల్లు లక్ష

Karthika Nair

కరెంట్ బిల్లులు చూసి సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా షాక్ అవుతారు. సామాన్యులకు, వ్యవసాయ కూలీలకు లక్షల్లో కరెంట్ బిల్లులు వచ్చిన ఉదంతాలు చూశాం. ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా అలా లక్షల్లో బిల్లు వచ్చింది. అయితే ఆ హీరోయిన్ మాత్రం తను అంత కరెంట్ కాల్చలేదని చెబుతోంది. ఆమె పేరు కార్తీక.

లాక్ డౌన్, కరోనా కారణంగా ముంబయిలో కరెంట్ మీటర్ రీడింగ్ లు తీయడం లేదు. అంచనా బిల్లులు మాత్రమే అందిస్తున్నారు. అలా జూన్ నెలకు గాను తనకు లక్ష రూపాయలు బిల్లు వేశారని చెబుతోంది కార్తీక. ఇందులో ఎలాంటి స్కామ్ ఉందో చెప్పాలంటూ నేరుగా ముంబయికు కరెంట్ సప్లయ్ చేసే అదానీ ఎలక్ట్రిసిటీకి ట్యాగ్ చేసి ప్రశ్నించింది. తనలానే చాలామంది ముంబైకర్స్ భారీ కరెంట్ బిల్లులతో బాధపడుతున్నారని అంటోంది.

తెలుగులో నాగచైతన్య నటించిన “జోష్” సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది కార్తీక. కానీ టాలీవుడ్ లో పెద్దగా రాణించలేకపోయింది. తమిళ్ లో చేసిన “రంగం” సినిమా ఆమెకు లైఫ్ టైమ్ గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే దాన్ని ఆమె క్యాష్ చేసుకోలేకపోయింది. ప్రస్తుతం అరకొర సినిమాలతో కెరీర్ ను నెట్టుకొస్తోంది ఈ బ్యూటీ.

Related Stories