‘భక్తి ప్లస్ అడ్వెంచర్… కార్తికేయ 2’

‘కార్తికేయ‌’తో మంచి విజయం అందుకొని లైంలైట్ లోకి వచ్చారు దర్శకుడు చందు మొండేటి. ఇప్పుడు “కార్తికేయ 2” తీశారు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా చందు మొండేటి తన సినిమా గురించి చెప్పిన విశేషాలు… సంక్షిప్తంగా…

  • పురాణ గాథలు ఇష్టం

కృష్ణతత్వం అనే పాయింట్ తీసుకొని కార్తీకేయ 2 తీశా. చిన్నప్పటి నుంచే ఇతిహాసాలు, పురాణగాథలపై ఇష్టం ఏర్పడింది. శ్రీకృష్ణుడు ద్వారకాలో వున్నాడా లేదా పాయింట్ చుట్టూ కృష్ణ తత్త్వం అల్లి చెప్పిన చిత్రం ఇది. భక్తి సినిమాలు చూడడానికి ఎవరూ రావడం లేదనే మాట నిజమే. అందుకే, భక్తి తో పాటు అడ్వెంచర్ ఎలిమెంట్ జోడించాం. ప్రేక్షకులు ఒక కొత్త అనుభూతి పొందుతారు.

  • మొదటి భాగం, రెండో భాగం

“కార్తికేయ 1” మంచి హిట్ అయింది. అందులో హీరో మెడికల్ స్టూడెంట్. ఇందులో డాక్టర్. నిఖిల్ నటనలో మెచ్యూరిటీ వచ్చింది. “కార్తికేయ1” లో నటించిన స్వాతి పాత్రకు ఈ కథలో స్కోప్ లేదు. అందుకే స్వాతిని తీసుకోలేదు. మొదటి భాగం చూడకపోయినా రెండో భాగం అర్థమవుతుంది. మున్నాభాయ్, లగేరహో మున్నాభాయ్ చిత్రాల్లా… హీరో కామన్. కానీ హీరోయిన్లు, కథ, నేపథ్యం వేరు.

Also Check: Anupama poses like her mother!

  • ‘దేవి పుత్రుడు’తో పోలిక
    వెంకటేష్ నటించిన ‘దేవి పుత్రుడు’ కూడా ద్వారక నేపథ్యంగానే సాగింది. కానీ ఆ సినిమాకు ఈ కథకు ఎటువంటి పోలిక లేదు.
Karthikeya 2
  • కార్తికేయ 3?
    కార్తికేయ 3 ఉంటుందా అనేది ఇప్పుడే చెప్పలేను. ఈ సినిమా తరువాత నెక్స్ట్ గీతా ఆర్ట్స్ లో ఉంటుంది. గీతా ఆర్ట్స్ తరువాత నాగార్జున గారితో మరో చిత్రం చేయబోతున్నాను.
Advertisement
 

More

Related Stories