హిందీలో కార్తికేయ 2 జోరు

Karthikeya 2


హిందీ మార్కెట్ లో తెలుగు సినిమాల హవా కొనసాగుతోంది. ‘పుష్ప’, ‘ఆర్ ఆర్ ఆర్’, ‘మేజర్’ తర్వాత మరో హిట్ ‘కార్తికేయ 2’. ఈ సినిమా హిందీ వర్షన్ కి మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు … ఏడు లక్షల రూపాయలు. నిన్న (శనివారం) మూడు కోట్లు పొందింది. ఇప్పటివరకు ఈ సినిమా హిందీలో 11 కోట్లు కొల్లగొట్టింది. రోజు రోజుకి కలెక్షన్లు పెరగడం విశేషం.

కృష్ణ తత్త్వం, కృష్ణుడు … ఈ కాన్సెప్టులు హిందీ ప్రేక్షకులకు నచ్చాయి. గత కొంతకాలంగా ఇండియాలో ‘హిందుత్వ’, దేశభక్తి చిత్రాలదే హవా నడుస్తోంది. బాలీవుడ్ సినిమాలను బాయ్ కాట్ చేస్తూ సౌత్ నుంచి వస్తున్న ఇలాంటి ‘రైట్ వింగ్’ అనుకూల చిత్రాలకు పట్టం కడుతున్నారు హిందీ ప్రేక్షకులు. కారణం ఏదైనా, నిఖిల్ సిద్ధార్థ్ కి ఇది పెద్ద విజయం.

ఇకపై, చిన్న, పెద్ద, మీడియం అని సినిమాలు కాకుండా తెలుగు నిర్మాతలు అందరూ హిందీ రిలీజ్ పై దృష్టి పెడుతారు.

మరోవైపు, అమెరికాలో కూడా ఈ సినిమా బాగా ఆడుతోంది.

Advertisement
 

More

Related Stories