వరంగల్ టు హైదరాబాద్ … ప్రేమ పెళ్లి

- Advertisement -


హీరో కార్తికేయ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ లోహిత రెడ్డిని పెళ్ళాడుతున్నాడు. ఆదివారం (ఆగస్టు 22) వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది.

వరంగల్ నిట్ లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ బంధం ప్రేమగా మారింది. 11 ఏళ్ల స్నేహం తర్వాత జీవిత భాగస్వాములవుతన్నారు. ఇరువైపులా కుటుంబాల మధ్య బంధాలు పెనవేసుకొని ఉన్నాయి. కార్తికేయ రెడ్డి, లోహిత రెడ్డి… ఇద్దరూ హైదరాబాద్ కి చెందినవారే. కానీ, వరంగల్ లో వీరికి పరిచయం. చదువుకుంటున్నప్పటి నుంచి వీరి బంధం కొనసాగుతోంది.

2010లో చదువుకుంటున్నప్పుడు కలిసి తీసుకున్న ఫోటోని, ఇప్పటి ఎంగేజ్ మెంట్ ఫోటోని కలిపి షేర్ చేశాడు కార్తికేయ. “నా బెస్ట్ ఫ్రెండ్ తో నిశ్చితార్ధం జరిగింది. నిట్‌ వరంగల్‌లో 2010లో తొలిసారి లోహిత కలిశాను.”

ALSO READ: Actor Kartikeya gets engaged to Lohitha Reddy

టాలీవుడ్ లో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువే. రామ్ చరణ్ – ఉపాసన, అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి, నితిన్ – షాలిని, రానా దగ్గుబాటి – మిహీక… వీరి బాటలో కార్తికేయ – లోహిత.

 

More

Related Stories