కార్తికేయ కష్టం వేస్ట్ అయింది!

Kartikeya,

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీలోకి వచ్చాడు కార్తికేయ. మొదట్లో కండలు తప్ప నటన కష్టం అన్న కామెంట్స్ తెచ్చుకున్నాడు. కానీ ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్ పాత్రతోనే నటుడిగా మార్కులు కొట్టాడు. హీరోగా కూడా నటన చూపించాలని…ఎంతో కష్టపడి ‘చావు కబురు చల్లగా’ సినిమా చేశాడు. ఈ సినిమాలో అతని ఎఫర్ట్ కి అందరూ మార్కులు వేశారు. అతని నటన మెచ్చుకున్నారు. కానీ… సినిమా మాత్రం తేడా కొట్టేసింది.

రెండో రోజుకే పెట్టాబేడా సర్దేసిన మూవీ ఇది. ఈ సినిమాని నిర్మించిన జీఏ2 పిక్చర్స్ కూడా రిలీజ్ తర్వాత కనీస ప్రొమోషన్ కూడా చెయ్యలేదు. రిలీజ్ కి ముందు ‘పెద్ద పెద్ద మాటలు’ మాట్లాడి… రిలీజ్ తర్వాత సైలెంట్ అయిపోయారు.

కార్తికేయ కష్టం అంతా వృధా అయిపోయింది.

More

Related Stories