కాబోయే భార్యకు ‘రాజా విక్రమార్క’ ప్రొపోజల్

Kartikeya


కార్తికేయ గుమ్మకొండ హీరోగారూపొందిన సినిమా… ‘రాజా విక్రమార్క’. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది ఇది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో తన కాబోయే భార్యని అభిమానులకు పరిచయం చేశారు కార్తికేయ.

“ఆమెకి నేనే ప్రపోజ్ చేశా. ‘నేను హీరో అవుదామనుకుంటున్నాను. హీరో అయ్యాక మీ ఇంటికి వచ్చి అడుగుతా’ అని చెప్పా. ఫైనల్లీ… ఆ అమ్మాయిని నవంబర్ 21న పెళ్లి చేసుకోబోతున్నాను. తన పేరు లోహిత. తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గాళ్ ఫ్రెండ్. ఇక నుంచి ఒక్కటే రోల్.. వైఫ్” అని చెప్పారు. అనంతరం వేదికపై లోహితకు కార్తికేయ ప్రపోజ్ చేశారు.

“ఈ ఫంక్ష‌న్‌కు పిలిచిన వెంట‌నే వ‌చ్చిన ‘దిల్’ రాజుగారు, సుధీర్ బాబుగారు, శ్రీవిష్ణు అన్నయ్య, విశ్వక్ సేన్, కిరణ్…. ప్రతి ఒక్కరికీ థాంక్యూ. ‘రాజా విక్రమార్క’ చిరంజీవిగారి టైటిల్. ఈ టైటిల్ దగ్గర నుంచి ఈ సినిమా నాకు చాలా స్పెషల్. సినిమాకు వస్తే… ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైన తర్వాత కథలు వింటున్న సమయంలో ఒక ఫ్రెండ్ ద్వారా శ్రీ సరిపల్లి కథ చెప్పాడానికి వచ్చాడు. విన్నాను. కథ నచ్చింది. ‘ఆర్ఎక్స్ 100′ తర్వాత కొన్ని సినిమాలు చేశా. అయితే, ఈ సినిమా నా సినిమా అన్నట్టు మనసులో ఒక కనెక్షన్ ఏర్పడింది. ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. ’88’ రామారెడ్డి, ఆదిరెడ్డిగారికి థాంక్స్. వాళ్లకు నిర్మాణం కొత్త అయినా… నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య ఈ సినిమాలో నటించాడు,” అని సినిమా గురించి చెప్పారు కార్తికేయ.

“నాకు ‘గ్యాంగ్ లీడర్’, ‘చావు కబురు చల్లగా’ సినిమాలకు మంచి పేరొచ్చింది. కానీ, ‘ఆర్ఎక్స్ 100’ రేంజ్ కమర్షియల్ హిట్ రాలేదు. ఆ లోటు ఈ సినిమాతో తీరుతుంది అని భావిస్తున్నా,” అని అన్నారు కార్తికేయ.

 

More

Related Stories