కార్తీకేయ… అటు విలన్ ఇటు హీరో!

Kartikeya


“RX100” మినహా మరో హిట్ ఇవ్వలేకపోయాడు కార్తీకేయ గుమ్మకొండ. ఐతే, హీరోగా తనకంటూ ఒక ప్లేస్ క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు 29 ఏళ్ల ఈ కుర్ర హీరో. ఇటీవల విడుదలైన ‘చావు కబురు చల్లగా’ అపజయం పాలైనా అతని నటనకి మంచి మార్కులు పడ్డాయి. త్వరలోనే విడుదల కాబోతున్న ‘రాజా విక్రమార్క’ టీజర్ కూడా ప్రామిసింగ్గానే ఉంది.

సో… హీరోగా రాణించేందుకు కార్తీకేయకి ఇంకా చాలా స్కోప్ ఉంది.

ఐతే, కేవలం హీరో పాత్రలకే పరిమితం కావొద్దనేది అతని భావన. ఇప్పటికే విలన్ వేషాలు కూడా వేస్తున్నాడు. నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో విలన్ గా నటించాడు. తాజాగా అజిత్ నటించిన ‘వలిమై’ సినిమాలో మెయిన్ విలన్ కూడా కార్తీకేయనే. ఒకవేళ అజిత్ సినిమా భారీ హిట్ అయితే అతనికి తమిళంలో విలన్ రోల్స్ ఎక్కువగానే వస్తాయి.

కానీ హీరో వేషాలకే తొలి ప్రాధాన్యం అంటున్నాడు కార్తీకేయ. హీరోగా సినిమాలు చేస్తూనే ఇలా విలన్ పాత్రలు, స్పెషల్ రోల్స్ చేస్తాడట. మంచి ప్లానింగే.

 

More

Related Stories