సూపర్ హిట్ సినిమాకు నిరాదరణ

పుష్ప, కేజీఎఫ్2 లాంటి సౌత్ సినిమాలు కాకుండా.. రీసెంట్ గా బాలీవుడ్ లో హిట్టయిన స్ట్రయిట్ సినిమా ఏదైనా ఉందంటే అది “ది కశ్మీర్ ఫైల్స్” మాత్రమే. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా, ఊహించని విధంగా నార్త్ లో పెద్ద హిట్టయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సంచలనం సృష్టించింది. ఇలా కళ్లుచెదిరే విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా, ఓటీటీలో మాత్రం ఫ్లాప్ అయింది.

జీ5లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమాకు ఆదరణ తక్కువగా ఉంది. సినిమాను ఆసాంతం చూసిన వాళ్లు చాలా తక్కువగా ఉన్నారనేది జీ ఇంటర్నల్ టాక్. అంతా మూవీని ఓపెన్ చేసిన 20 నిమిషాలకే క్లోజ్ చేస్తున్నారట.

ది కశ్మీర్ ఫైల్స్ సినిమా డాక్యుమెంటరీ తరహాలో సాగుతుంది. రెగ్యులర్ సినిమా టైపులో ఈ సినిమాలో జోష్ ఉండదు. కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపించవు. సినిమాతో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే ఇది ఓటీటీ ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదనేది ఓ విశ్లేషణ.

సినిమాపై గతంలో వచ్చిన భారీ హైప్ ను దృష్టిలో పెట్టుకొని, చాలామంది దీన్ని ముక్కలు ముక్కలుగా చూస్తున్నారు తప్ప, ఒకేసారి సినిమా అంతా చూసేవాళ్లు చాలా తక్కువగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కు రీచ్ చాలా తక్కువగా ఉంది.

 

More

Related Stories