- Advertisement -

కశ్మీర్ పండితుల వెతలను చూపించిన చిత్రం…. ‘కశ్మీర్ ఫైల్స్’. కాశ్మీర్ నుంచి పండితులను ఎలా వెళ్లగొట్టింది, ఎలా ఊచకోత కోసింది చూపించిన చిత్రం ఇది. “‘కశ్మీర్ ఫైల్స్‌లో నిజాలు చూపించాం. మరుగున పడ్డ నిజ చరిత్రని” చూపించాం అని అంటున్నారు అనుపమ్ ఖేర్. ఆయన ఇందులో నటించారు.
అనుపమ్ ఖేర్ కూడా హిందూ పండితుడే. ఆయన కాశ్మీర్ నుంచి వచ్చిన వారే.
డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తీసిన ఈ చిత్రంలో దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ నటించారు. అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి నిర్మించిన ఈ హిందీ చిత్రం అందరూ చూడాలని కోరుతోంది టీం.
ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది.