
విజయ్ దేవరకొండ అంటే చాలామందికి క్రష్ ఉంటుంది. అందులో హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే ఓ సీనియర్ హీరోయిన్ మాత్రం దేవరకొండ అంటే తనకు పిచ్చి అంటోంది. విజయ్ దేవరకొండను పార్టులు పార్టులుగా వర్ణించి పడేసింది. ఆ సీనియర్ హీరోయిన్ పేరు కస్తూరి.
“విజయ్ దేవరకొండకు తల్లిగా అస్సలు నటించను. గర్ల్ ఫ్రెండ్ గా చేయమంటే చేస్తాను. విజయ్ అంటే నాకు చాలా క్రష్. అతడు పెర్ ఫెక్ట్ హీరో. అతడు ఎలా ఉన్నా బాగుంటాడు. గడ్డంతో, దువ్వకుండా, షర్ట్ లేకుండా ఉన్నా కూడా బాగుంటాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే విజయ్ దేవరకొండ చాలా హాట్. ఓ ఇటాలియన్ సూపర్ మోడల్ లా ఉంటాడు,” అంటూ సిగ్గుపడుతూ చెప్పింది.
ఏ హీరోకైనా తల్లిగా నటిస్తాను కానీ, విజయ్ దేవరకొండకు మాత్రం తల్లిగా నటించనంటోంది కస్తూరి. అయితే డబుల్ యాక్షన్ సబ్జెక్ట్ ఉంటే మాత్రం అందులో ఓ విజయ్ కు తల్లిగా, మరో విజయ్ కు ప్రేయసిగా నటిస్తానంటోంది. మొత్తానికి విజయ్ ఫ్యాన్ లిస్ట్ లో మరో హాట్ సీనియర్ నటి చేరిపోయిందన్నమాట.