నేను బీజేపీలో చేరట్లేదు: కస్తూరి

సౌత్ లో బలపడేందుకు భారతీయ జనతా పార్టీ సినిమా స్టార్లను తమ పార్టీలోకి చేర్చుకోవడమో, వారితో ప్రచారం చేయించుకోవడమో చేస్తోంది. రీసెంట్ గా ఖుష్భు కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరింది. ఇక తెలంగాణలో కూడా విజయశాంతితో చర్చలు జరిపారు బీజేపీ నేతలు. అలాగే ప్రస్తుతం టీవీ సీరియల్స్ తో మహిళలకు చేరువ అయిన కస్తూరి శంకర్ ని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు అమిత్ షా పావులు కదిపారని ప్రచారం జరిగింది.

ఐతే, కస్తూరి ఈ వార్తలను ఒట్టి పుకార్లుగా పేర్కొంది. బీజేపీ నాయకుడు మురుగన్ ని ఇటీవల కలవడంతో ఈ ప్రచారానికి బలం వచ్చిందని తమిళ్ మీడియా అంటోంది. కస్తూరి సోషల్ మీడియాలో ఇలా రాసింది – “నేను నిన్న సాయంత్రం మురుగన్‌ను కలిశాను అనేది నిజమే. కానీ నేను కలిసినది ఎల్ మురుగన్ (బీజేపీ నాయకుడు) ని కాదు, దేవుడు మురుగన్ ని.” అలా పుకార్లకు చెక్ పెట్టింది.

కస్తూరి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. ఆమె తన ఫోటోలు, కామెంట్లతో కుర్రకారును ఆకట్టుకుంటోంది.

Related Stories