ఐసీయూలో కత్తి మహేష్

- Advertisement -
Kathi Mahesh

‘బిగ్ బాస్’ ఫేమ్, నటుడు కత్తి మహేష్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. కుడి కన్ను తీవ్రంగా దెబ్బతిన్నది అని డాక్టర్లు తెలిపారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద శనివారం ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు వేగంగా లారీని ఢీ కొట్టడంతో ఆయనకి తీవ్ర గాయాలు అయ్యాయి.

నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మహేష్ సినిమా విశ్లేషకుడిగా, దర్శకుడిగా, నటుడిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా చిరపరిచితులు. వివాదాల కారణంగా బాగా పాపులర్ అయ్యారు.

 

More

Related Stories