కత్రిన ఎంగేజ్మెంట్ జరిగిందట

Katrina

వచ్చే నెలలో కత్రిన కైఫ్ పెళ్లి అంటూ బాలీవుడ్ మీడియా కొన్నాళ్లుగా హడావిడి చేస్తోంది. కత్రిన కైఫ్, బాలీవుడ్ యువ హీరో విక్కి కౌశల్ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారు. తాజాగా వారి నిశ్చితార్థంకి సంబంధించిన ఫోటోలు ఇవే అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఐతే, అవి నిశ్చితార్థం ఫొటోలా, దీపావళి వేడుకలకు సంబంధించినవా అన్నది తెలియడం లేదు. ఇద్దరూ రింగులు మార్చుకున్న ఫొటోల్లో లేదు. కేవలం సంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు. కత్రిన కూడా ఈ విషయంలో పెదవి విప్పడం లేదు. ఆమె తన సోషల్ మీడియాలో ఎక్కడా పెళ్లి ప్రస్తావన, నిశ్చితార్థం
గురించి హింట్ ఇవ్వలేదు. దీపావళికి శుభాకాంక్షలు తెలుపుతూ సంపద్రాయ చీరలో దిగిన ఫోటోలు మాత్రం అప్డేట్ చేసింది.

కత్రినకిప్పుడు 37 ఏళ్ళు. ఇప్పటికే రణబీర్ కపూర్ తో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది. పెళ్లివరకు వచ్చిన తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. అందుకే, ఈ సారి పెళ్లి విషయంలో ఆమె ఓపెన్ అవడం లేదు. ఆమె నటించిన ‘సూర్యవంశీ’ గత వారం విడుదలైంది. మంచి ఓపెనింగ్స్ అందుకొంది.

 

More

Related Stories